పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని కోరారు.
అలాగే ముంపు గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వరదలతో దెబ్బ తిన్న ప్రతి ఎకరాకు రూ.15వేలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. పోలవరం నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించాలని కోరారు. సమస్యలు తీర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: