సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం జాతీయ కార్యదర్శి చంద్రన్నను శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్‌తో బాధపడుతున్న చంద్రన్న మంగళగిరి ఆస్పత్రికి వచ్చి తిరిగి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తరలించారు. 2014లో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో చంద్రన్నపై కేసు నమోదైంది. ఈ కేసు నిమిత్తం చంద్రన్నను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు.
చంద్రన్నను అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తమ నాయకుడు చంద్రన్నకు ప్రాణహాని ఉందని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : పోలవరం బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదు: కేంద్రం