లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు మూసివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఏలూరు ఎక్సైజ్ డీసీ కార్యాలయం వద్ద సీపీఐ కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ధరలు పెంచి.. మద్యం విక్రయాలు చేపట్టడం వల్ల నిరుపేదలు నష్టపోతున్నారన్నారు. మద్యం ప్రియులు గుమిగూడడం వలస కరోనా వ్యాప్తి చెందే అవకాశముందన్నారు.
ఇవీ చదవండి.. 'అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి'