అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ.. చివటం గ్రామస్తులు ధర్నాకు దిగారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ వాసులంతా కలిసి.. పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గ్రామంలో 24 సంవత్సరాలుగా దేవస్థానం భూముల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలకు నోచుకోకుండా కాలం గడుపుతున్నామన్నారు.
అలాంటి తమను కాదని మిగిలిన వారికి ఇళ్ల స్థలాల మంజూరు చేయడం ఏంటని నిలదీశారు.ఎంపిక చేసిన వారితో పాటు తమకు కూడా అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సీపీఎం నాయకులు కామన మునిస్వామి సంఘీభావం తెలిపారు.
ఇవీ చూడండి: