ETV Bharat / state

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ధర్నా - రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ధర్నా వార్తలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ బిల్లులు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

cpi dharna in statewise against agricultural bills
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ధర్నా
author img

By

Published : Sep 25, 2020, 2:24 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆమోదించిన బిల్లు ఆర్డినెన్స్​ ప్రతులను తగలబెట్టారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్న ఆ బిల్లులను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు.

విజయనగరం జిల్లాలో..

కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపిస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాలు విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిరసన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త బిల్లులు రైతుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో.. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నాయకులు మండిపడ్డారు.

కృష్ణా జిల్లాలో..

ఉచిత విద్యుత్ రైతుల హక్కని, నగదు బదిలీ వద్దని, జీవో నెంబరు 22ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. కృష్ణా జిల్లా కంచర్లలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగదు బదిలీ పథకం అమలుకు జారీచేసిన జీవో 22ను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై సంస్కరణల అమలుకు చేస్తున్న ఒత్తిడికి తలవంచరాదని, సంక్షోభంలో ఉన్న కౌలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో..

రైతులను దివాళా తీయించే కేంద్ర చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా రైతులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ ఆద్వర్యంలో కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతు ఉత్పత్తి వాణిజ్య బిల్లు, ధరల హామీ ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలో..

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో రైతు సంఘాల నాయకులు ధర్నా చేశారు. బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని స్థానిక నూనెపల్లెలో అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకో నిర్వహించారు. బిల్లుల కారణంగా రైతులకు నష్టం జరుగుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ రైతు బిల్లును రద్దు చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో.. కర్నూలు జిల్లా డోన్​లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాదాపు గంటకు పైగా రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా చేస్తున్న ఉద్యమ కారులను అరెస్ట్ చేసి స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఇవీ చదవండి..

వివేకా హత్య కేసు: ఆ ముగ్గురిని విచారిస్తున్న సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.