ETV Bharat / state

Delivery in 108 Ambulance: అంబులెన్స్‌లోనే కరోనా రోగి ప్రసవం..తల్లీ బిడ్డా క్షేమం!

author img

By

Published : Jun 4, 2021, 10:36 AM IST

ఓ నిండు గర్బిణీకి ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకుంటోంది. గురువారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. 108 వాహనంలో ఆమెను తరలిస్తుండగా..మార్గమధ్యలో సుఖ ప్రసవమైంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

Delivery in 108 Ambulance
అంబులెన్స్‌లోనే కరోనా రోగి ప్రసవం

పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావుపాలెంకు చెందిన గర్భిణీ.. 108 వాహనంలో మగబిడ్డను ప్రసవించింది. 2 రోజుల కిందట పరీక్షలో సావిత్రి(35)కి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకుంటూ ఉంది. అర్థరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను 108 సిబ్బంది రక్షణ కిట్లతో ఏలూరు ఆస్పత్రికి తరలించే క్రమంలో.. పూళ్ళ జంక్షన్ వద్ద సుఖ ప్రసవం జరిగింది. పురిటి నొప్పులు ఎక్కువ అవ్వటంతో..అంబులెన్స్​ను పక్కకు ఆపి..108 సిబ్బందే పురుడుపోశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఇరువురిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్య సిబ్బంది తల్లీ, బిడ్డకు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

Nellore GGH: వైద్య విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన..సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.