పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బందికి కరోనా వాక్సిన్ను అన్ని పోలీసు స్టేషన్లలో, ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు టీకాలను వేశారు. జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్‌కు కరోనా వ్యాక్సిన్ వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో టీకాను ఫ్రంట్ వారియర్స్‌గా ఉన్న పోలీస్ సిబ్బందికి అందించామని ఎస్పీ తెలిపారు. టీకాని తయారుచేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలిపారు.
తొలి డోసు వేసుకున్నాక 28 రోజులపాటు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా వేసుకున్న నాలుగు రోజుల పాటు మద్యం ముట్టొద్దని, పొగతాగరాదని, పోషకాహారం తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి