పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కరోనా అలజడి నెలకొంది. మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కృష్ణా జిల్లా బంటుమిల్లి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ హను శ్రీ, ఆర్ఎస్ఐ విజయ్ కుమార్, డ్రైవర్ కమల్ సంతోశ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చింతలపూడి మండలం లింగగూడెంలో గురువారం అక్రమ మద్యం తరలిస్తూ వీరు పట్టుబడ్డారు. వీరిని రిమాండ్కు తరలించే క్రమంలో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు వెల్లడైంది. దీంతో పోలీసు స్టేషన్లో అలజడి నెలకొంది. అప్రమత్తమైన అధికారులు స్టేషన్ ప్రాంగణాన్ని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేశారు.
పోలీసు స్టేషన్లో కరోనా కలకలం..! - పోలీసు స్టేషన్లో కరోనా కలకలం
మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నిందితులకు కరోనా సోకటంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అలజడి నెలకొంది. అప్రమత్తమైన అధికారులు స్టేషన్ ప్రాంగణాన్ని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేశారు.
![పోలీసు స్టేషన్లో కరోనా కలకలం..! పోలీసు స్టేషన్లో కరోనా కలకలం !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7972278-818-7972278-1594402170242.jpg?imwidth=3840)