జిల్లాలో సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఆదివారం ఒక్కసారిగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య వీటితో కలిపి 51కి చేరింది. తొలుత నమోదైన కేసుల్లో పది మంది కోలుకోగా.. యంత్రాంగం వారిని ఇటీవల ఆసుపత్రి నుంచి ఇళ్లకు పంపించింది. ప్రస్తుతం మరికొందరు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. పూర్తిస్థాయి ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. వారిలో కొందరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని, తుది నివేదికలు రాగానే డిశ్చార్జి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: