పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం ఏపిగుంట గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అతడిని ఏలూరు క్వారంటైన్‌కు తరలించారు. అతని కుటుంబ సభ్యులతోపాటు మొత్తం 19 మందిని తాడేపల్లిగూడెం ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి దిల్లీ నుంచి వచ్చిన ముస్లిం కుటుంబాన్ని కలిసిన కారణంగా.. 14 రోజులు తాడేపల్లిగూడెం క్వారంటైన్లో ఉంచారు.
శనివారం ఉదయం అతనికి ఎలాంటి లక్షణాలు లేవని గ్రామానికి పంపించారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాలంటూ జిల్లా వైద్యాధికారులు ఫోన్ చేయగా మండలంలోని రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అతన్ని ఏలూరుకు తరలించారు.
ఇవీ చదవండి: