పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా బాధితులు కోవిడ్ ఆస్పత్రిలో వేగంగా కోలుకొంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 38 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 30మంది ఏలూరు ఆశ్రమ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏలూరు వైఎస్ఆర్ కాలనీ, నరసాపురం రెడ్ జోన్ ప్రాంతాల్లో గత 40 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 19 ప్రాంతాల్లో రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న బీహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల వలసకూలీలను మూడు ప్రత్యేక రైళ్ల ద్వారా వారి రాష్ట్రాలకు పంపారు. తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో ఏడువందల మంది క్వారంటైన్లలో ఉన్నారు.
ఇదీ చూడండి: