కరోనా రక్కసితో కుదేలైన రొయ్యల పరిశ్రమ - పశ్చిమ గోదావరి న్యూస్
కొవిడ్-19తో రొయ్యల పరిశ్రమ కుదేలైంది. కొన్ని నెలలుగా సరైన ధరలు లేక ఇబ్బందులెదుర్కొంటున్న ఈ పరిశ్రమ లాక్‌డౌన్ కారణంగా మరింతగా నష్టాల్లోకి జారుకుంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం, ప్రాసెసింగ్ యూనిట్ల మూత కారణంగా రొయ్యలను కొనే నాథుడే కరవయ్యాడు. ప్రభుత్వం కనీస ధర నిర్ణయించినా... అమలవుతున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల పరిశ్రమ పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు..