పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట మండలాలను కరోనా మహమ్మారి కబలిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో మన్యం మండలాల్లో గిరిజనులు కలవరపడుతున్నారు. బుట్టాయిగూడెం మండలం మారుమూల గ్రామంలో ఓ గిరిజన ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. జంగారెడ్డి గూడెంలో తాజాగా 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, చింతలపూడి, గోపాలపురం తదితర మండలాల్లో రోజుకి 10కి పైగా పాజిటివ్ కేసులు గుర్తిస్తున్నారు. కరోనా బాధితులను తీసుకువెళ్లేందుకు అంబులెన్సులు రాకపోవడంతో బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోకి ప్రజలు రాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 8 రోజులు పూర్తి లాక్డౌన్ విధించారు. అత్యవసర ఔషధ దుకాణాలు తప్ప మిగతా వాటిని మూయించారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో ఒక్క రోజే 16 కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా.. 7,813 కరోనా కేసులు నమోదు