పశ్చిమగోదావరి జిల్లా మన్యం మెట్ట మండలాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. జంగారెడ్డిగూడెంలో వరుస కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. చింతలపూడి, కామవరపుకోట, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో నిత్యం కేసులు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. చింతలపూడి మండలం.. అల్లిపల్లిలో గర్భిణికి పాజిటివ్ నమోదైంది.
ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. జంగారెడ్డిగూడెంలో మూడు రోజుల్లో 8 కేసులు నమోదయ్యాయి. పోలవరం మండలంలో ఒకే రోజు 10 కేసులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ప్రాంతంలో ఔషధ దుకాణం యజమానికి, అతని కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కేసులు పెరుగుతుండటంతో పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని పురపాలక అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: '3 రాజధానులు చేయాలంటే విభజన చట్టం సవరించాల్సిందే'