పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. మార్టేరులోని ఓ కాంప్లెక్స్ వద్ద మద్యం సేవించిన అన్నదమ్ములు నల్లి కిషోర్, నల్లి సంపత్ రావు గంటల వ్యవధిలో మృతి చెందిన ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఖననం చేసిన నల్లి కిషోర్ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు.
సంఘటన జరిగిన రోజు నల్లి కిషోర్, శేఖర్, అన్నవరం, మురళి అనేవారు కలిసి మద్యం విందులో పాల్గొన్నారు. కిషోర్ మాత్రమే మద్యం తాగి చికెన్ తిన్నాడు. మురళి, శేఖర్ మద్యం తాగకుండా చికెన్ మాత్రమే తిని వెళ్లిపోయారు. కిషోర్, అన్నవరం తాగగా మిగిలిన మద్యాన్ని, చికెన్‌ను కిషోర్ ఇంటికి తీసుకువచ్చి... సంపత్ రావుకు ఇచ్చాడు. సంపతరావు మద్యం తాగి చికెన్ తిన్నాడు. కిషోర్, సంపత్ రావు లు కొన్ని గంటల వ్యవధిలో చనిపోయారు.
ముందుగా కిషోర్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించేటప్పటికి మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి చెందాడని కిషోర్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే సంపత్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనుమానం వ్యక్తం చేసిన సంపత్ రావు భార్య పెనుమంట్ర పోలీసులను ఆశ్రయించింది. పార్టీలో పాల్గొన్న అన్నవరంపై కిషోర్ బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అన్నవరం మాత్రం మిగిలిన వారి కంటే తాను తక్కువగా తాగానని చెబుతున్నాడు.
ఇదీ చదవండి: