ETV Bharat / state

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం కుదింపు - Compression of polling time in third phase election news

పశ్చిమగోదావరి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరిగే మూడోవిడత ఎన్నికల పోలింగ్ సమయం కుదించారు. రెండు గంటలు ముందుగానే పోలింగ్​ను ముగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Compression of polling time
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం కుదింపు
author img

By

Published : Feb 17, 2021, 9:36 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మూడోవిడత ఎన్నికల పోలింగ్ సమయం కుదించారు. ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని 32పంచాయతీలను మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. రాత్రి సమయంలో ఓట్ల లెక్కింపు చేపడితే.. భద్రతకు కష్టతరమవుతుందన్న కారణంగా పోలింగ్​ను రెండు గంటలు ముందుగా ముగించనున్నట్లు తెలిపారు. పోలింగ్ సందర్భంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ప్రారంభమైన మూడో దశ పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.