పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఫిర్యాదులు చేసేందుకు బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి తరలారు. దౌర్జన్యం, అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు కారణాలుగా పేర్కొంటూ జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్‌కు ఫిర్యాదులు చేశారు. సోమర్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామంలో ఉన్న తమ భూములను చింతమనేని, అతని అనుచరులు ఆక్రమించారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత ఏడాది శ్రీరామవరంలో బహిరంగ ప్రదేశంలో దళితులను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారని తనపై అక్రమంగా కేసు నమోదుచేశారని కొత్తపల్లి సురేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ మాట్లాడుతూ బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: