నేడు పోలవరం డంప్ యార్డును సందర్శించేందుకు సంయుక్త నిపుణుల కమిటీ తరలివెళ్లనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాల ఇబ్బందులపై పరిశీలన చేయనుంది. పర్యావరణం, స్థానికులకు ఉన్న సమస్యలపై ఆరా తీయనుంది. నిర్మాణ వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని ఎన్జీటీలో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది.
క్షేత్రస్థాయి పరిశీలనకు..
క్షేత్రస్థాయి పరిశీలనకు ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయగా.. జస్టిస్ శేషశయనరెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన టీం పర్యవేక్షించనుంది. ఇవాళ, రేపు పోలవరం ప్రాజెక్టు, డంప్ యార్డు ఉన్న గ్రామాల్లో నిపుణులు పర్యటించనున్నారు. బుధవారం పోలవరం హైస్కూల్ మైదానంలో కమిటీ సైతం బహిరంగ విచారణ చేపట్టనుంది. ఏప్రిల్ 2న రాజమహేంద్రవరంలో నివేదిక రూపొందించనుంది.