పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని చేబ్రోలు సొసైటీ కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ.12.5 లక్షలు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పంపిణీ చేశారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరమని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గానికి సీఎం సహాయనిధి నుంచి 260 మందికి రూ.49.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ రమావతి, వైకాపా మండల కన్వీనర్ మంగారావు, సొసైటీ చైర్మన్ పాపారావు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి జిల్లాలో ప్రారంభమైన ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీ