ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అన్ని పరీక్షల్లో సాధారణంగానే ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఎయిమ్స్ వైద్యులు.. బాధితుల నమూనాలు తీసుకెళ్లారని.. మరో నాలుగు కేంద్ర బృందాలు ఆసుపత్రికి రానున్నాయని అధికారులు తెలిపారు. ..ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎమ్ఆర్ బృందాలు కూడా ఏలూరుకు వస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలు సహా దెందులూరు పరిధిలోనూ..... అస్వస్థత కేసులు గుర్తించామని అన్నారు. ఐఐసీటీ, ఎన్ఐఎన్, ఐసీఎమ్ఆర్ బృందాలు కూడా ఏలూరుకు వస్తాయని వెల్లడించారు.. దిల్లీ ఎయిమ్స్‌కు ఇప్పటికే శాంపిల్స్ పంపామని... ప్రాథమికంగా నీటి పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులూ కనిపించలేదని పేర్కొన్నారు. రక్త పరీక్ష ఫలితాలు కూడా సాధారణంగానే వస్తున్నాయన్నారు. అన్ని వైరస్ టెస్ట్‌లు నిర్వహించామని.. అన్నీ నెగిటివ్‌గా వచ్చాయని సీఎంకు వివరించారు. సీటీ స్కాన్ చేయించినా.... అస్వస్థతకు కారణాలు తెలియలేదని వివరించారు. బ్లడ్ కల్చర్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సెల్యులర్ అండ్ మాలిక్యులర్ అనాలసిస్ కోసం పరీక్షలు చేశామని సీఎంకు వివరించారు.
నీరు కాచుకుని తాగిన వారికి, మినరల్ వాటర్ తాగిన వారిలోనూ ఈ సమస్య గుర్తించామన్నారు. అరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ కమిషనర్‌ను ఏలూరులో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. కొన్ని కేసుల్లో తల నొప్పులు, వాంతులు గమనించామన్న అధికారులు.. అందరిలో నీరసం కనిపిస్తోందన్నారు. ఇంట్లో అందరికీ రావట్లేదని కేవలం కొందరికి మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా బాధితులు ఆనారోగ్యానికి గురవుతున్నారని అధికారులు సీఎంకు తెలిపారు.
168 మందిని డిశ్చార్జ్ చేసి పంపితే అందులో ముగ్గురు మళ్లీ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు డిశ్చార్జైన వారిలో...... అస్వస్థతతో తిరిగి ఎవరైనా ఆస్పత్రిలో చేరారా అని అధికారులను సీఎం అడిగారు. ముగ్గురు మళ్లీ చేరారని అధికారులు బదులివ్వగా.... కోలుకున్నవారిని కూడా అబ్జర్వేషన్ లో ఉంచాలని సీఎం ఆదేశించారు. డిశ్చార్జయిన వారికి సరైన ఆహారం, మందులు అందించాలన్నారు..వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు డిశ్చార్జ్ అయిన వారికి మంచి పోషకాహారం అందించాలని సీఎం సూచించారు.
వైద్యుల బృందాల పరిశీలనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అనుకోనిది ఏదైనా జరిగితే.... వెంటనే స్పందించేలా ఉండాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు... ఏలూరులో ఉండాలన్నారు. ఎవరికి ఎలాంటి అస్వస్థ కలిగినా.... 104, 108 నంబర్లకు ఫోన్ చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: