ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. నరసాపురం వ్యవహారాన్ని సీఎం చాలా సీరియస్‌గా తీసుకున్నారని వెల్లడించారు. ఇలాగే మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు.
'పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకూడదని జగన్ స్పష్టం చేశారు. ఆ పరిస్థితి వస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని సీఎం గట్టిగా చెప్పారు. నాయకులు ఛాలెంజ్‌లు చేసుకోవద్దు.... పార్టీ ఆదేశం మేరకే మీడియా సమావేశం పెట్టాలని సీఎం చెప్పారు. ఎవరు తొందరపడ్డారనే విషయంపై జగన్ విచారణ చేయిస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవు. పార్టీపరంగా ప్రకటిస్తున్నాం, రఘురామకృష్ణరాజుకు ఇదే నోటీసుగా పరిగణించాలి. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే ఆరోపణ సరికాదు' అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇవీ చదవండి