చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని 220 మంది పారిశుద్ధ్య కార్మికులకు బంగారు దుకాణాదారుడు జూలగంటి మురళి మోహన్ గుప్తా వస్త్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వాటిని పంపిణీ చేశారు. ప్రాణాలు సైతం లెక్కచేకుండా నిత్యం ప్రజలు శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇదేరీతిలో వ్యాపారులంతా ముందుకు వచ్చి సాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. చెరువులో పడి ముగ్గురు మృతి