పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కృష్ణారావు అనే వ్యక్తిపై గతంలో దాడి చేశాడనే కారణంతో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో ఏలూరు జిల్లా కారాగారంలో చింతమనేని రిమాండ్‌లో ఉన్నారు. ఆయనను ఇవాళ కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే చింతమనేనిపై ఏడో కేసు నమోదైంది.
ఇదీ చూడండి: చింతమనేనిపై ఐదో కేసు నమోదు..14 రోజుల రిమాండ్.