పశ్చిమగోదావరిలో పార్టీ బలోపేతంమే ప్రధాన అజెండాగా తెదేపా అధినేత చంద్రబాబు నేటి నుంచి 3రోజుల పాటు ఆ జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోపార్టీకి పూర్వవైభవంతో పాటు నేతల మధ్య సమన్వయంపైనా చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా దుగ్గిరాల వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్ని పరామర్శించనున్నారు. అనంతరం తణుకులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ గోపాలపురం, పోలవరం, ఏలూరు నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. రాత్రికి తణుకులోనే చంద్రబాబు బస చేయనున్నారు. వైకాపా నేతల వేధింపులకు గురైన బాధితులతో 19వ తేదీ చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. 20వ తేదీన పాలకొల్లు, ఉండి, ఆచంట, భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి.
నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
తెదేపా అధినేత చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి 3 రోజులపాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు.
పశ్చిమగోదావరిలో పార్టీ బలోపేతంమే ప్రధాన అజెండాగా తెదేపా అధినేత చంద్రబాబు నేటి నుంచి 3రోజుల పాటు ఆ జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోపార్టీకి పూర్వవైభవంతో పాటు నేతల మధ్య సమన్వయంపైనా చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా దుగ్గిరాల వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్ని పరామర్శించనున్నారు. అనంతరం తణుకులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ గోపాలపురం, పోలవరం, ఏలూరు నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. రాత్రికి తణుకులోనే చంద్రబాబు బస చేయనున్నారు. వైకాపా నేతల వేధింపులకు గురైన బాధితులతో 19వ తేదీ చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. 20వ తేదీన పాలకొల్లు, ఉండి, ఆచంట, భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి.
ap_vja_02_18_cbn_westgodavari_tour_dry_3064466_1711digital_1574005818_26
Conclusion: