తణుకు కేశవ స్వామి వారి ఆలయం ఎంతో పురాతనమైంది. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి భూలోక సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వామి వారిని ప్రతిష్టించాడని పురాణ కథనం. అప్పటి నుంచి స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం సప్తాహ్నిక దీక్షా పూర్వకంగా దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రజల పాపాలు హరించే వాడు, కేశి అనే రాక్షసుని సంహరించటం వల్ల కేశవుడు అనే పేరు వచ్చినట్లు చెబుతారు. కల్యాణం అనంతరం స్వామివారి దర్శనం చేసుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తులు నమ్ముతారు.
ఏకాదశి రోజు రథోత్సవంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదనేది శాస్త్రవచనంగా చెప్తారు. భీష్మ ఏకాదశి రోజు స్వామి వారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండీ... జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఘన విజయం