దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఏలూరు గ్రామీణ మండలం మల్కాపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ రైతులపై నిర్బంధ చర్యలు ప్రయోగించటం దుర్మార్గమన్నారు. రైతుల పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని రైతులను కోరారు.
ఇవీ చదవండి