పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. నల్లజర్లకులోని ఏ.కే.ఆర్.జీ. పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తుండగా.. తిమ్మయ్యపాలెం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఇద్దరు విద్యార్థులతో పాటు బస్సు డ్రైవర్ వెంకట్రావు స్వల్పంగా గాయపడ్డారు.
ఇదీ చదవండి