పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పశువుల పాక, రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మూడు పాడిపశువులు, రెండు దూడలు తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలు అదుపు చేశారు. ఎవరైనా ఏదైనా కాల్చడం వల్ల నిప్పు అంటుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు రెండున్నర లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి..