ETV Bharat / state

భీమవరం సమీపంలో భారీ శబ్దంతో పేలుడు.. ఏం జరిగింది?

author img

By

Published : Aug 13, 2021, 10:05 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం - ఉండి మార్గంలోని అనాకోడేరు కాలువ సమీపంలో ఖాళీ స్థలంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

blast at near Bhimavaram
భీమవరం సమీపంలో భారీ శబ్దంలో పేలుడు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం - ఉండి రోడ్డులోని అనాకోడేరు కాలువ సమీపంలోని ఖాళీ స్థలంలో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటనా ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనాకోడేరు కాలువ సమీపంలో ఓ ఖాళీ స్థలంలో ఉంది. సమీపంలో వెల్డింగ్, మెకానిక్ దుకాణాలు ఉన్నాయి.

ఒక్కసారిగా సంభవించిన పేలుడుకు అక్కడే గడ్డి మేస్తున్న ఆవు తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి వుంది.

సీఎం పర్యటన నేపథ్యంలో అలర్ట్..

భీమవరంలోని శనివారం జరిగే ఓ వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్​ హాజరుకానున్నారు. ఈ తరుణంలో పేలుడు సంభవించడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పేలుడుకు గల కారణాల గురించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

SP Reaction: వివేకా కుమార్తె లేఖకు ఎస్పీ స్పందన.. సునీత ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.