ETV Bharat / state

ఎమ్మెల్యే దాతృత్వం: సబ్​ కలెక్టర్​కు 76 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల అందజేత - Mla Oxygen donation Latest News

కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 76 కాన్సన్​ట్రేటర్లను భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నరసాపురం సబ్ కలెక్టర్​ విశ్వనాథన్​కు అందజేశారు. సొంతంగా 20 యంత్రాలను సమకూర్చిన ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల సాయంతో మరో 56ను అందించారు.

ఎమ్మెల్యే దాతృత్వం: సబ్​ కలెక్టర్​కు 76 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల అందజేత

author img

By

Published : May 20, 2021, 3:56 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని భీమవరం పట్టణంలో రోజు రోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ బెడ్లు దొరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సొంత ఖర్చులతో 20 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను కొనుగోలు చేసి సబ్ కలెక్టర్ విశ్వనాథన్​కి అందజేశారు.

రూ.45 లక్షలతో..

ఎమ్మెల్యే స్ఫూర్తితో భీమవరం నియోజకవర్గలో అధికార వైకాపా నాయకులు, దాతలు ముందుకు వచ్చి మరో 56 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందించారు. భీమవరంలో సుమారు రూ.45 లక్షలతో 76 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ మిషన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

మెరుగైన సేవల కోసమే..

కొవిడ్ రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రాణ వాయువు అందించే యంత్రాల కొనుగోలుకు ముందుకొచ్చిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్​ను నరసాపురం సబ్​ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్​ ప్రత్యేకంగా అభినందించారు.

ఇవీ చూడండి : కరోనా సోకిందా.. కంగారుపడొద్దు..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.