పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి వద్ద ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. తెలంగాణ సరిహద్దుల్లో అక్కడి అధికారులతో మాట్లాడిన కలెక్టర్ కాలినడకన ఆంధ్రా సరిహద్దు చేరుకున్నారు.
సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఎస్సై విశ్వనాథ బాబు, ఆక్టోపస్ ఎస్ఐ శ్రీనివాసులుతో మాట్లాడారు. వలస కూలీలను తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు వచ్చాయా అని ప్రశ్నించారు. 2 రాష్ట్రాల అధికారులు చర్చించి వలస కూలీలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి:
స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.. పోలీసులు అడ్డుకున్నారు