Dussehra Dandiya 2024 Festival in Vijayawada : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా దాండియా ఆటలే కనిపిస్తాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేస్తారు. చిన్న పిల్లలు, యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ లేదంటే జంటగా ఆడుతూ సవ్య, అపసవ్య దిశలలో తిరుగుతుంటారు.
ఆకట్టుకున్న నవ దుర్గ అవతారాల ప్రదర్శన : విజయవాడలో వీ- ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా దాండియా 2024 ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా దాండియా నృత్యం చేశారు. చిన్నారులు చేసిన నవ దుర్గ అవతారాల ప్రదర్శన చూపురులను ఆకట్టుకుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా వీ- ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా దాండియా ఫెస్టివల్ సందడి సాగింది. గాంధీనగర్‌లోని ఓ హోటల్లో దాండియా 2024 ఫెస్టివల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ - జలవిహారంపై ఇవాళ మధ్యాహ్నంలోగా నిర్ణయం
రతన్ టాటా మృతికి సంతాపం : దాండియా నృత్యానికి ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపాన్ని ప్రకటించారు. భారతదేశాన్ని రతన్ టాటా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అమ్మవారిని స్మరిస్తూ యువతులు, మహిళలు చేసిన దాండియా నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. విజయవాడ నగరంలో తాము నిర్వహించిన దాండియా ఫెస్టివల్‌కు మహిళల నుంచి ఇంత మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని వీ - ఈవెంట్స్అధినేత దుర్గ ప్రసాద్ తెలిపారు.
అమ్మవారిని కీర్తిస్తూ దాండియా నిర్వహించడం అభినందనీయం : కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే వేడుక దాండియా అని మహిళలు తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వారు అన్నారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కీర్తిస్తూ దాండియా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విజయవాడలో ఇటువంటి వేడుకలో పాల్గొనడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
దసరా వేళ కళారాల సంబరం - ఒంగోలులో ప్రత్యేక ఉత్సవం
"దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా దాండియా నృత్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకలో పాల్గొనడం కొత్త అనుభూతిని కలిగించింది. మన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది."- మహిళలు
కనులపండువగా శ్రీవారి మహా రథోత్సవం - వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు