పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బంగ్లాదేశ్‌కు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని మోక్షాపూర్ జిల్లా గోపాల్బంజ్కు చెందిన ఓ వ్యక్తి 6 ఏళ్ల క్రితం నదీ మార్గంలో కలకత్తా వచ్చాడు. అక్కడు సుఖవ్యాధులకు సంబంధించిన వైద్యం నేర్చుకుని విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేశాడు. 2015లో జంగారెడ్డిగూడెంలో స్థానిక చిరునామాతో ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సంపాదించి.. శివ పేరుతో క్లినిక్‌ను మొదలుపెట్టాడు. అనంతరం బంగ్లాదేశ్‌లో ఉన్న కుటుంబసభ్యులను కలుసుకోవడం కోసం వీసా పొందేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చినట్లు ఒప్పుకున్నాడు.
ఇవీ చదవండి.. కూతురిని వేధిస్తున్న ఆటోడ్రైవర్‌కు తల్లి దేహశుద్ధి