కరోనా నివారణ నేపథ్యంలో భాగంగా తణుకు, అత్తిలి, ఇరగవరంలో అధికారులు పూర్తి బంద్కు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలకు ఔషధ దుకాణాలకు మినహాయింపు నిచ్చారు. మిగిలిన వర్తక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. పెట్రోల్ బంకులు సైతం మూసివేశారు. వైద్య అవసరాల కోసం వచ్చే వారిని మాత్రం పట్టణంలోనికి అనుమతించారు. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పూర్తి బంద్ పాటించాలని, మంగళ, శుక్రవారాలు నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహాయించి మిగిలిన అన్ని దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోమ, బుధ ,గురు, శని వారాలలో మాత్రమే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చునని నిబంధనలలో తెలిపారు.
ఇవీ చదవండి