ఖరీఫ్ కాలానికి సంబంధించి 15.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కానుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందులో స్థానిక అవసరాలను మినహాయించి 14.04 లక్షల టన్నుల ధాన్యాన్ని పీపీసీల ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్ కాలానికి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 443, వెలుగు ఆధ్వర్యంలో 175, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 15 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
లక్ష్యం మేరకు కొనుగోళ్లు
జిల్లాలో ఖరీఫ్ కాలానికి సంబంధించి నిర్ణయించిన లక్ష్యం మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. పీపీసీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గోనె సంచుల కొరత ఉన్నమాట వాస్తవమే. రైస్ మిల్లర్ల వద్ద అందుబాటులో ఉన్న గోనె సంచులు ధాన్యం సేకరణకు సరిపోకుంటే తగినన్ని సంచులను జిల్లాకు సరఫరా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. - డి.రాజు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు
జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మంది రైతులున్నారు. రైతు భరోసా కేంద్రాలు 938 ఉన్నాయి. ఆర్‌బీకేల్లో రైతులందరి పేర్లను నమోదు చేయాలనేది లక్ష్యం. రైతు పేరు, అతని తండ్రి పేరుతో పాటు ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, పట్టాదారు పాస్‌పుస్తకం తదితర వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: