ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am

...

9am topnews
ప్రధానవార్తలు9am
author img

By

Published : Dec 15, 2022, 8:58 AM IST

  • ప్రభుత్వ కార్యక్రమమైతే చాలు.. డ్వాక్రా మహిళలకు కష్టాలే
    స్వయం ఉపాధిలో ఏళ్లుగా దేశానికి ఆదర్శంగా నిలిచిన.. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలు.. ఇప్పుడు అధికార పార్టీ సభలకు ప్రధాన వీక్షకులుగా మారుతున్నారు. ఆ సభతో ఎలాంటి సంబంధం లేకున్నా సరే.. వారు తప్పనిసరిగా రావాల్సిందే. లేదంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తారు. రుణాలు రాకుండా చేస్తామని హెచ్చరిస్తారు. మహిళలను తీసుకురాని అధికారులకు.. లక్ష్యాన్ని చేరుకోలేదని వేధిస్తారు. ఇలాంటి నేపథ్యంలో అధికార పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలంటేనే.. డ్వాక్రా మహిళలు, సంబంధిత అధికారులు.. బెంబేలెత్తిపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమరావతి రైతులు దిల్లీ యాత్ర.. జంతర్‌మంతర్‌ వద్ద 3 రోజులు ఆందోళన
    అమరావతిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్‌తో రాజధాని ప్రాంత రైతులు దిల్లీ యాత్ర చేపట్టారు. ఇవాళ ప్రత్యేక రైలులో దిల్లీ బయల్దేరనున్నారు. రాజధాని ఉద్యమం మొదలై ఈ నెల 17 నాటికి మూడేళ్లవుతున్న సందర్భంగా.. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు ఆందోళన చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో అమరావతి మద్దతు కూడగట్టేందుకు.. వివిధ పార్టీల నేతల్ని కలవాలని నిర్ణయించారు. దిల్లీ యాత్ర ద్వారా కేంద్రప్రభుత్వానికి తమ వాణిని గట్టిగా వినిపిస్తామని ఐకాస నేతలు, రైతులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రుషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీ వేయాలి:హైకోర్టు
    రుషికొండ తవ్వకాలపై ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండటం సరికాదని వ్యాఖ్యానించింది. కమిటీపై పునఃపరిశీలించాలని.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దక్షిణాది విడిది కోసం తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి రానున్నారు. 26వ తేదీ నుంచి 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లు దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి రాలేదు. రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన ద్రౌపది ముర్ము తొలిసారి దక్షిణాది విడిదికి వస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనా దూకుడుకు చెక్.. తూర్పు సెక్టార్​లో వాయుసేన యుద్ధ విన్యాసాలు
    తూర్పు సెక్టార్‌లో భారత వాయుసేన గురువారం నుంచి రెండు రోజుల పాటు యుద్ధవిన్యాసాలను నిర్వహించనుంది. ఇటీవల భారత్​-చైనా మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విన్యాసాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, పాంగాంగ్​ సరస్సు సమీపంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నగలు తాకట్టుపెట్టి ఊరికి ఉపకారం.. సొంతంగా వంతెన, రోడ్డు నిర్మించిన తండ్రీకొడుకులు
    ఆ ఊరికి వెళ్లాలంటే నది దాటాలి. కానీ అది దాటడానికి బ్రిడ్జ్​ లేదు. ఈ కారణంగా ఇబ్బంది పడుతున్న తన గ్రామ ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నాడు ఓ డ్రైవర్​. ఉపాధిని వదులుకొని, తన భార్య నగులు తాకట్టు పెట్టి బ్రిడ్జ్​ కట్టాడు. కుమారుడి ఆశయానకి తండ్రి కూడా సహాయం చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తవాంగ్ ఘర్షణపై చైనాకు అమెరికా షాక్.. భారత్​కు పూర్తి మద్దతు
    అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా.. చైనాను తప్పుబట్టింది. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం భారత్‌ తీసుకొన్న చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలు.. రూ.1500 కోట్ల లాభం టార్గెట్'
    యూకో బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1500 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆ బ్యాంకు ఎండీ, సీఈఓ సోమ శంకర ప్రసాద్‌ తెలిపారు. బ్యాంకు మొండి బకాయిలు తగ్గుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలు నెలకొల్పనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫైనల్‌కు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్
    సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో ఫ్రాన్స్‌ 2-0 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో.. ఈ మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హీరోయిన్స్ అందం.. విజయానందం.. హిట్టు కొట్టి.. కెరీర్​లో నిలదొక్కుకొని..
    చిత్రసీమకి కొన్నిసార్లు విజయాలే ప్రామాణికం. ప్రతిభ ఎంతున్నా సరే వెనక విజయం ఉందా లేదా అన్నదే కీలకం. ఒక మంచి విజయం దక్కిందంటే చాలు అవకాశాలు వెల్లువెత్తుతాయి. అదే ఒక్క పరాజయం ఎదురైనా ప్రయాణం వెంటనే ఒడుదుడుకులకి లోనవుతుంది. కథానాయికల విషయంలో ఇది మరింత వేగంగా పక్కాగా అమలయ్యే విషయం. ఎప్పుడూ జోరు మీద కనిపించే స్టార్‌ భామలకి అప్పుడప్పుడూ ఒకట్రెండు పరాజయాలు ఎదురైనా ఆ ప్రభావం పెద్దగా కనిపించదేమో కానీ ద్వితీయ శ్రేణి కథానాయికలకి మాత్రం అది ఎదురు దెబ్బే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.