లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలను తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీ డైరెక్టర్ సూర్యప్రకాశరావు ఖండించారు. కొంతమంది వ్యక్తులు తనపై కక్ష కట్టి... నకిలీ వీడియోలు సృష్టించారని ఆయన ఆరోపించారు. వాటిని పట్టుకుని భాజపా నేత మాణిక్యాలరావు వంటి నేతలు... తనపై ఆరోపణలు చేయటం తగదని హితవు పలికారు. ఈ అంశంపై విచారణ చేయాలని హెచ్ఆర్సికి తానే స్వయంగా లేఖ రాశానని వెల్లడించారు. త్వరలోనే పోలీసులు దీనిపై విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తారని చెప్పారు.
'నాపై కక్షతో నకిలీ వీడియోలు సృష్టించారు' - ఎన్‌ఐటీ డైరెక్టర్ సూర్యప్రకాశరావు తాజా
తనపై కక్ష కట్టిన కొంతమంది వ్యక్తులు నకిలీ వీడియోలు సృష్టించారని ఎన్‌ఐటీ డైరెక్టర్ సూర్యప్రకాశరావు స్పష్టం చేశారు. ఈ అంశంపై విచారణకు హెచ్ఆర్సికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
'నాపై కక్షతో నకిలీ వీడియోలు సృష్టించారు'
లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలను తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీ డైరెక్టర్ సూర్యప్రకాశరావు ఖండించారు. కొంతమంది వ్యక్తులు తనపై కక్ష కట్టి... నకిలీ వీడియోలు సృష్టించారని ఆయన ఆరోపించారు. వాటిని పట్టుకుని భాజపా నేత మాణిక్యాలరావు వంటి నేతలు... తనపై ఆరోపణలు చేయటం తగదని హితవు పలికారు. ఈ అంశంపై విచారణ చేయాలని హెచ్ఆర్సికి తానే స్వయంగా లేఖ రాశానని వెల్లడించారు. త్వరలోనే పోలీసులు దీనిపై విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తారని చెప్పారు.
ఇవీ చూడండి-ఏఎన్యూ వీసీపై గవర్నర్కు ఫిర్యాదు