విశాఖలో ఇలా...
విశాఖ మన్యంలోని అరకులోయ మాలి అంగన్వాడి ఆయా పోస్టు ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని భాగమతి అనే మహిళ కేంద్రానికి తాళం వేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి అంగన్వాడి భవనానికి తాళం వేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో అలా
తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులే పనిచేయాలి.. మీరు పనిచేయడానికి వీల్లేదంటూ.. అంగన్వాడీ కేంద్రానికి అధికార నాయకుడొకరు తాళం వేశారు. భవనం తాళం తీస్తే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. అంగన్వాడీ సిబ్బంది ఆరుబయటే తరగతులు నిర్వహించారు. చిన్నారులకు అక్కడే భోజనాలు వడ్డించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి బాపిరాజుగూడెంలో ఈ ఘటన చోటుచేసుకొంది.