పశ్చిమగోదావరి జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3889 అంగన్వాడీ కేంద్రాల ద్వారా లక్షా 60వేల మంది పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వీరితో పాటు జిల్లాలో సుమారు 44 వేల మంది గర్భిణీ స్త్రీలకు కూడా లబ్ధి చేకూరనుంది. 'అంగన్వాడీ పిలుస్తోంది రా' కార్యక్రమం ద్వారా నేటి నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లనున్నారు. పిల్లలను గుర్తించడంతో పాటు వారికి ఇచ్చే పౌష్టికాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కొత్త కార్యక్రమంలో భాగంగా ఐదు ఏళ్ళు నిండిన 27 వేల మంది చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చనున్నారు. మూడేళ్లు నిండిన సుమారు 38 వేల మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తారు.
ఇదీ చూడండి