పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. త్వరలో కొత్త టీవీ షోలు చేస్తున్నట్లు అనసూయ తెలిపారు. తన కెరియర్లో రంగస్థలం చిత్రం మంచి బ్రేక్ ఇచ్చిందని అన్నారు. ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ నిలిచిపోయే పాత్రకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను నటించిన చిత్రాల్లో యాత్ర మరిచిపోలేని చిత్రమని పేర్కొన్నారు. కథలు నచ్చితే కథానాయికగా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనసూయ తెలిపారు.
ఇవీ చూడండి: