ETV Bharat / state

అనుమానాస్పద రీతిలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి - west Godavari district latest news

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సునీల్ నాయక్ అనే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అతనిది పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామం అని పోలీసులు గుర్తించారు. మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

engineering student died in Eluru
engineering student died in Eluru
author img

By

Published : Jan 23, 2021, 10:45 PM IST

ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి చెందిన సునీల్ నాయక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏలూరులో వట్లూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వసతి గృహంలో ఉంటున్న ఈ యువకుడు... శనివారం మృతి చెందాడు.

'నా చావుకు ఎవరు కారణం కాదు. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా' అని మృతుడి పేరుతో ఉన్న ఓ లేఖ పోలీసులకు లభ్యమైనట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

దుర్గ గుడి వెండి సింహాల కేసులో నిందితులు అరెస్టు.. చోరీ ఎలా జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.