అమూల్ పాల సేకరణ కార్యకలాపాలు నేటిి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలివిడతలో 142 గ్రామాల్లో పాలను సేకరించనున్నారు. ఇప్పటి వరకు 15వేల మంది రైతులను గుర్తించి నమోదు పూర్తి చేశారు. పాల నాణ్యత, వెన్న ఆధారంగా లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకు అదనపు ఆదాయం లభించే విధంగా అమూల్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘అమూల్ సంస్థ ఇప్పటికే చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాలను సేకరిస్తోంది.’ అని వివరించింది.
ఇదీ చదవండి: