ETV Bharat / state

Alluri Family: రేపు రాష్ట్రానికి మోదీ.. కలవనున్న అల్లూరి వంశీయులు - ప్రధానిని కలవనున్న అల్లూరి సీతారామరాజు వంశీయులు

Alluri Family: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఈ నెల 4న భీమవరం రానున్నారు. ఈ నేపథ్యంలో.. అల్లూరి వంశీయులు పలువురు ఆయనను కలవనున్నారు.

Alluri seetharamaraju Family to meet pm modi
ప్రధానిని కలవనున్న అల్లూరి వంశీయులు
author img

By

Published : Jul 3, 2022, 8:54 AM IST

Alluri Family: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఈ నెల 4న భీమవరం వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని.. అల్లూరి వంశీయులు పలువురు కలవనున్నారు. పలు ప్రాంతాల్లో స్థిరపడిన తమ వంశీయులంతా ఆరోజున భీమవరం రానున్నారని విజయనగరానికి చెందిన అల్లూరి సోదరుడు సత్యనారాయణరాజు మనవడు శ్రీరామరాజు చెప్పారు. శనివారం భీమవరం వచ్చిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు. తమ కుటుంబీకులు 27 మంది ప్రధానిని కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. విశాఖ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రధానిని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

Alluri Seetharama Raju: విశాఖ జిల్లా పాండ్రంగిలో సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దంపతులకు 1897 జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారు. ఆయన చిన్నతనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొన్నాళ్లు నివసించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. కొవ్వాడ, వెంప గ్రామాలతో పాటు పాలకోడేరు మండలం మోగల్లు, నరసాపురాల్లో కొంతకాలం ఉన్నారు. అల్లూరిని బాల్యంలో ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. అల్లూరిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపింది తల్లిదండ్రులే. బ్రిటీష్‌ వారి అకృత్యాలు చూడలేక... స్వాతంత్య్ర సంగ్రామాన్ని విప్లవ పంథాలో ముందుకు తీసుకెళ్లారు సీతారామరాజు. గెరిల్లా తరహా దాడులతో బ్రిటిష్‌ సైన్యాన్ని గడగడలాడించి.. సమర స్ఫూర్తిని నింపారు. దేశం కోసం బ్రిటిష్‌వారిని ఎదురించి.. 1924లో కేవలం 27 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు అర్పించారు. అల్లూరి 125వ జయంతి వేళ.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా అల్లూడి నడయాడిన మోగల్లు గ్రామస్థులు ఆయన త్యాగాన్ని, పోరాటాలను మననం చేసుకుంటున్నారు.

Mogallu: దేశంలోని మొట్ట మొదటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని 1965లో మోగల్లు పంచాయతీ చెరువుగట్టున ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని అల్లూరి ముఖ్య అనుచరుడు, అప్పటి పార్లమెంట్‌ సభ్యుడు మల్లు దొర పర్యవేక్షణలో తయారు చేయించారు. 1986లో జలగం వెంగళరావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అల్లూరి స్మారక తపాల బిల్లు విడుదల చేశారు. అల్లూరి నివసించినచోట స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా.. ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో స్థానికులే చొరవ తీసుకుని అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణం మొదలు పెట్టారు. అల్లూరి 125 వ జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న వేళ... నిర్మాణ పనులు జోరుందుకున్నాయి. ప్రధాని రాక పట్ల మోగల్లు గ్రామస్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మోగల్లు వాసుల సంబరాలు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్బంగా.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భీమవరంలో ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమవరం సమీపంలో అల్లూరి కుటుంబ సభ్యులు నివసించిన మోగల్లు వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు ఆయన జీవిత విశేషాలను తెలియజెప్పే స్మారక నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.

స్వగ్రామంలో జ్ఞానమందిరం: మోగల్లులో సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో అల్లూరి పేరిట జ్ఞాన మందిరం నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. దీన్ని 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ అధ్యక్షుడు దండు శ్రీనివాసరాజు తెలిపారు. పార్టీలకు అతీతంగా అల్లూరి స్మారక నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

మ్యూజియం ఏర్పాటు చేయాలి: అల్లూరి సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో నేను 8 ఏళ్లుగా సేవ చేస్తున్నా. ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతా. ఈ స్థలం చుట్టూ కంచె ఏర్పాటుచేసి మొక్కలు పెంపకం చేపట్టా. ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. - కొత్తపల్లి సీతారామరాజు, మోగల్లు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.