ETV Bharat / state

Alluri Statue: 30 అడుగుల విగ్రహం.. రూ.3 కోట్ల వ్యయం

Alluri Bronze statue: జులై 4న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ పార్కు వద్ద రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని అవిష్కరించనున్నారు.

అల్లూరి కాంస్య విగ్రహాం
అల్లూరి కాంస్య విగ్రహాం
author img

By

Published : Jun 29, 2022, 9:08 AM IST

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జులై 4న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించనున్న 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏఎస్‌ఆర్‌ పార్కు ప్రాంగణంలో వేదికపై అమర్చారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజల తర్వాత విగ్రహాన్ని ఏడు అడుగుల కాంక్రీటు దిమ్మపైకి చేర్చారు. అల్లూరి అతిపెద్ద కాంస్య విగ్రహం ఇదేనని క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు చెప్పారు. దీని తయారీకి 10 టన్నుల కాంస్యం, 5 టన్నుల ఇనుము వాడారు. దాదాపు రూ.3 కోట్ల వరకు వెచ్చించారు. సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు మంగళవారం అల్లూరి విగ్రహాన్ని సందర్శించారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.