విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఐ తణుకు ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి కోరారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తహాసీల్దార్ పీఎన్డీ ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వ ఆసుపత్రులు, విశాఖ ఉక్కు, సెయిల్, ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలే ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యత గుర్తించాలని వారు కోరారు. లక్షమందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ రాష్ట్రానికి తలమానికంగా వున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని విన్నవించారు.
ఇదీ చదవండి:
ఇంత కొరత ఉన్నప్పుడు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులా?: సీఎం జగన్