Agitation for district headquarters: పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా వైద్యులు దీక్ష చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేసి.. నరసాపురాన్ని మాత్రం జిల్లాగా ప్రకటించకపోవటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు.
జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే నరసాపురం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుని.. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన భీమవరంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం సరికాదన్నారు.
నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ.. మొగల్తూరులో వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. స్థానికంగా ఉన్న చేపల మార్కెట్లో చేపలు అమ్ముతూ వినూత్న నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంగా "భీమవరం వద్దు.. నర్సాపురం ముద్దు" అంటూ నినాదాలు చేశారు.
గుంటూరులో..
సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలను కలిపి కొత్తగా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ గా గుర్తించాలని.. అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. రెండు నియోజకవర్గాలకు చెందిన అఖిలపక్షం నేతలు గుంటూరు జిల్లా పెదకూరపాడులో సమావేశమయ్యారు. అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు మండలాలు.. నరసరావుపేటకి 60 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెదేపా నేత కొమ్మలపటి శ్రీధర్ పేర్కొన్నారు. వైకాపా మినహా అన్ని పార్టీలు నేతలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
జగన్ రెడ్డికి 'అస్కార్' కాదు.. 'మోసకార్ అవార్డు' ఇవ్వాల్సిందే - అచ్చెన్న