ETV Bharat / state

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో అనిశా సోదాలు - ద్వారకా తిరుమల గుడిపై వివాదం

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలోని పలు విభాగాల్లో అక్రమాలను అనిశా అధికారులు వెలికితీస్తున్నారు. దేవాలయంలో అనిశా దాడులు జరగడం ఇదే మొదటిసారి కావడంతో దేవస్థానం ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండో రోజు బుధవారం కూడా సోదాలు కొనసాగాయి. అనిశా డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా ఏర్పడి దేవస్థానంలోని అన్ని విభాగాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

ACB  searches at Dwarakathirumala Srivari temple
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో అనిశా సోదాలు
author img

By

Published : Sep 10, 2020, 8:00 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో పలు విభాగాల్లో అక్రమాలను బయట పెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రసాదాల తయారీ, విక్రయ కేంద్రాలు, టోల్‌గేట్‌, పరిపాలనా విభాగం, సెంట్రల్‌ స్టోర్‌, ఇంజినీరింగ్‌ సెక్షన్‌ ఇలా అన్ని విభాగాల్లో తనిఖీలు చేసి దస్త్రాలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఏసీబీ అధికారులమంటూ కొంతమంది వ్యక్తులు ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో ఆర్‌.ప్రభాకరరావును బెదిరించి రూ.1.97 లక్షలు వసూలు చేసిన విషయం వెలుగులోకి రావడం, దేవస్థానంలో పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయన్న సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్లు అనిశా డీఎస్పీ తెలిపారు.

ముఖ్యమైన పలు దస్త్రాలను సీజ్‌ చేసినట్లు అనిశా అధికారులు చెప్పారు. ప్రసాదాల తయారీ విభాగంలో జరిగిన నెయ్యి కుంభకోణానికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విభాగంలో కూడా అక్రమాలు జరిగినట్లు గుర్తించామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి నుంచి సొమ్మును రికవరీ చేస్తామని పేర్కొన్నారు.

దేవస్థానం భూములు, షాపుల లీజులు, సెంట్రల్‌ స్టోర్‌కు సరకులు కొనుగోళ్లకు సంబంధించి దస్త్రాలను పరిశీలించి వివరాలు సేకరించామన్నారు. కొండపై ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తక్కువ లీజుకు దుకాణం కేటాయించిన విషయంపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దేవస్థానం గార్డెనింగ్‌పై కూడా దృష్టి పెట్టామన్నారు. తుది నివేదికను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. డీఎస్పీతో పాటు అనిశా సీఐలు శ్రీనివాస్‌, రవీంద్ర పలువురు అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి: 'రంగులకు కోట్లు ఖర్చు చేశారు... పింఛన్‌ ఎందుకాపారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.