పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లిలో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తపై గొర్రెల దొంగతనం మోపి వేధిస్తున్నారన్న కారణంగా మాదేపల్లికి చెందిన లక్ష్మీ పురుగుల మందు తాగింది. అపస్మాకర స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితురాలు లక్ష్మీ, ఆమె భర్త మాదేపల్లిలో గొర్రెల కాపర్లుగా పనిచేసేవారు. గొర్రెలు తప్పిపోవడంతో... లక్ష్మీ భర్తే దొంగతనం చేశాడని గొర్రెల యజమాని నింద వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రూ.2 లక్షల నగదు చెల్లించాలని వేధిస్తున్నట్టు బాధితురాలు వాపోయింది.
ఇదీ చూడండి. పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: గుంటూరు జిల్లాలో తెదేపా నేతపై దాడి