పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన తాడిగడప బాలయ్య (65) ఏలూరు ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. నారాయణపురం గ్రామానికి చెందిన బాలయ్య బహిర్భూమికి నిమిత్తం కాలువ గట్టు వద్దకు వచ్చి, ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. బాలయ్య ఆచూకీ కోసం స్థానికులు గాలించినా ఫలితం లేకపోవడంతో వారు తాడేపల్లిగూడెంలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ బృందం బాలయ్య కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: విధానపరమైన లోపం ఉందనే..మధ్యంతర ఉత్తర్వులు!