పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో లాక్ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. ప్రతిరోజూ 60 నుంచి 80 మందికి భోజనం ప్యాకెట్లు తయారు చేసి పార్టీ కార్యాలయం వద్ద అందజేస్తున్నారు. గత 20 రోజులుగా భోజన ప్యాకెట్లు పంచుతున్నామని.. లాక్ డౌన్ ముగిసే వరకు పంపిణీ కొనసాగుతుందని మండల పార్టీ నాయకులు ఆనాల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణలు తెలిపారు.
ఇది చదవండి ఇంటింటికీ కోడిగుడ్లు అందజేసిన తెదేపా నేతలు